Andhra News: ఏపీలో ఐదోరోజుకు చేరుకున్న అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె
Andhra News: ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో యధాతథంగా సమ్మె
Andhra News: ఏపీలో అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చిన సమ్మెను యధావిధిగా కొనసాగిస్తున్నారు. నిన్న ప్రభుత్వంతో 11 అంశాలపై చర్చలు జరిగాయి. అయితే జీతం, గ్రాట్యుటీ విషయంలో ఎలాంటి పురోగతి లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. డిమాండ్లు పరిష్కారం అయ్యాకే సమ్మె విరమణ అంటున్నారు. అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగలకొట్టారని.. సమ్మె చేస్తున్న తమను ప్రభుత్వం బెదిరించాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
అయితే అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని మంత్రి బొత్స తెలిపారు. అలాంటి ఘటనలు జరిగినా పట్టించుకోమన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్లలో కొన్నింటికి అంగీకరించామని..మరికొన్ని డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు మంత్రి బొత్స. అంగన్వాడీలతో చర్చలు సఫలం అవుతాయనే భావిస్తున్నామని.. సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.