పరిస్థితులు కుదుటపడగానే ఎన్నికలపై నిర్ణయం.. ఎస్‌ఈసీకి సీఎస్ నివేదిక
స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం నో చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాలంటూ రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అఖిలపక్ష సమావేశం నిర్వహించడంతో.... స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు సీఎస్ నీలం సాహ్నీ నివేదిక ఇచ్చారు.
స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం నో చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాలంటూ రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అఖిలపక్ష సమావేశం నిర్వహించడంతో.... స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు సీఎస్ నీలం సాహ్నీ నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను వివరిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు రిపోర్ట్ ఇచ్చిన సీఎస్.. శాఖల వారీగా కరోనా బారినపడ్డ ఉద్యోగుల వివరాలు అందజేశారు. ముఖ‌్యంగా వేలాది మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టమన్న సీఎస్ నీలం సాహ్నీ పరిస్థితులు కుదుటపడగానే లోకల్ పోల్స్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే, కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు ఎస్‌ఈసీకి వివరిస్తామన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ. ఇక రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోకి రాగానే స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీని సంప్రదిస్తామని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అటు కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను గత మార్చిలో రమేశ్‌కుమార్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.