స్థానిక ఎన్నికలపై అసెంబ్లీలో కీలక నిర్ణయం!

జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేసింది.

Update: 2020-12-04 15:43 GMT

జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేసింది. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.... శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కరోనా తీవ్రత దృష్ట్యా స్థానిక ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం తీర్మానం చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందని.... కానీ, కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్నందున ప్రజల భద్రతే ముఖ్యమని ప్రభుత్వం స్పష్టంచేసింది. 

Tags:    

Similar News