ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం
కరోనా టైమ్‌లో నిధులకు కొరత లేకుండా చూసినందుకు బ్యాంకర్లకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆర్ధిక రంగానికి వ్యవసాయమే వెన్నుముక అన్న జగన్... రైతులకు పెట్టుబడి ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
కరోనా టైమ్‌లో నిధులకు కొరత లేకుండా చూసినందుకు బ్యాంకర్లకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆర్ధిక రంగానికి వ్యవసాయమే వెన్నుముక అన్న జగన్... రైతులకు పెట్టుబడి ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇక ఖరీప్ సీజన్‌లో 75వేల 237కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా... ఇప్పటివరకు 62వేల 650కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. అటు స్కూళ్లు, ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం బ్యాంకర్ల సహాయం కావాలన్నారు సీఎం జగన్. ప్రతీ గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక, వచ్చే నెలలో జగన్నన తోడు పథకం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు సీఎం జగన్. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న 25లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.