AP Tourism To Start From August: ఆగష్టు 1 నుంచి పర్యాటకం.. ఏపీ మంత్రి అవంతి వెల్లడి
AP Tourism To Start From August: కరోనా నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను తెరవనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.
AP Tourism To Start From August: కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను తెరవనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఆ ప్రాంతాల్లో సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టూరిజం, శిల్పారామం, సాంస్కృతిక విభాగాలపై ఆయన సమీక్ష జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరోనా లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలల నుంచి అన్ని పర్యాటక ప్రదేశాలను మూసివేసిన విషయం విదితమే. ఇటీవల విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పర్యాటక ప్రదేశాలను ఆగస్టు 1 నుంచి సందర్శకుల కోసం తెరుస్తామని ఆ రాష్ర్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు మంగళవారం మీడియాకు వెల్లడించారు.
పీపీపీ పద్ధతిలో రాష్ర్టంలో ఏడు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. మార్చి నుంచి పర్యాటక ప్రదేశాలను మూసివేయడంతో.. రాష్ర్టం రూ. 60 కోట్ల నష్టాన్ని చవిచూసిందని పేర్కొన్నారు. అన్ని పర్యాటక ప్రదేశాల్లో రాబోయే పదిహేను రోజుల్లో మరమ్మతులు చేపట్టి.. ఆగస్టు 1 నుంచి తెరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్టణంలో కొత్త జిల్లాను సృష్టించి.. దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే యోచనలో ఉన్నట్లు అవంతి శ్రీనివాస్ రావు తెలిపారు.