CM Jagan: ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇదొక నిదర్శనం..
CM Jagan: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా ఏపీ ఉందని అన్నారు సీఎం జగన్.
CM Jagan: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా ఏపీ ఉందని అన్నారు సీఎం జగన్. పల్నాడు జిల్లా యడ్లపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను జగన్ ప్రారంభించారు. 24 నెలల్లోనే ఈ యూనిట్‌కు అడుగులు పడ్డాయని, 20 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం గల ఈ యూనిట్ వలన.. కొత్తగా 33వేల మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు.. 14వేల మంది రైతులకు మేలు జరుగుతుందని జగన్ చెప్పారు.
ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్‌కు ఇదొక నిదర్శనం. ఈ ఏడాది పారిశ్రామికవేత్తలను అడిగి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడు సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం తీసుకోవడం గొప్ప మార్పుగా సీఎం జగన్ అభివర్ణించారు. రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు కల్పించాలనే ఉద్దేశంతో.. రాష్ట్రవ్యాప్తంగా 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను 3,450 కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వం ప్లాన్ చేసిందని, దీనివల్ల ప్రతీ జిల్లాలో ఉన్న రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని తెలిపారు.