AP Schools: ఏపీలో మోగిన బడిగంట.. బడిబాట పట్టిన విద్యార్థులు
AP Schools: ఈ ఏడాది పీపీ1, పీపీ2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు
AP Schools: ఏపీలో బడిగంట మోగింది. సమ్మర్ హాలీడేస్ తర్వాత స్టూడెంట్స్ నెమ్మదిగా బడిబాట పడుతున్నారు. మూలకున్న బ్యాగ్ దుమ్ము దులిపి విద్యార్థులు వడివడిగా స్కూళ్లకు వెళ్తున్నారు. నిజానికి నిన్ననే స్కూల్స్ మొదలు కావాల్సి ఉంది. కానీ మోడీ పర్యటన నేపథ్యంలో ఇవాల్టీ నుంచి స్కూల్స్ ని రీఓపెన్ చేశారు. అయితే ఈసారి ఆరు అంచెల కొత్త విధానంలో విద్యాసంవత్సరం అమలుకానుంది.
విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పీపీ-1, పీపీ-2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లను ప్రారంభించారు. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీహైస్కూల్, హైస్కూల్ ప్లస్‌గా పాఠశాలల ఉండనున్నాయి. తొలిరోజే విద్యార్థులకు ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కిట్లను అందించనున్నది. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అందించనున్నారు.