ఏపీఎస్ ఆర్టీసీ మాస్టర్ ప్లాన్... తెలంగాణ ఆర్టీసీ డల్ !

ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి గుంటూరు, విజయవాడతో సహా పలు మార్గాల్లో బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే.

Update: 2020-01-12 12:35 GMT
RTC File Photo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) అధికారులు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి గుంటూరు, విజయవాడతో సహా పలు మార్గాల్లో బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి వెళ్లే బస్సులు జనంతో నిండిపోతున్నాయి. అయితే తిరిగి వచ్చే సమయంలో ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు సూపర్ స్కెచ్ వేశారు. దీంతో తిరుగు ప్రయాణంలో కూడా బస్సులు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సులు మాత్రం విజయవాడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వెలవెలబోతున్నాయి. ఇంతకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు వేసిన స్కెచ్ ఎంటో తెలుసుకోవాలని ఉందా? అసలు విషయం చూద్దాం..

సంక్రాంతి సీజన్ ఈ సీజన్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ ఆర్టీసీ, ఇటు ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ చార్జీల విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గంలో వచ్చే బస్సుల చార్జీలను 40 శాతం తగ్గించింది. విజయవాడ మార్గం నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు 40 శాతం టికెట్ తగ్గుదల ఉండడంతో ఏపీఎస్ ఆర్టీసీ ప్రాధాన్యత ఇస్తు్న్నారు. దీంతో తెలంగాణ నుంచి విజయవాడవైపు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి.

కాగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే తెలంగాణ ఆర్టీసీ బస్సులు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. దీనికి కారణం ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు టికెట్ చార్జీల్లో 40 శాతం తగ్గించడమే. హైదరాబాద్ వెళ్లే బస్సులు కనీసం డీజిల్ ఖర్చులైనా వచ్చేలా ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల ఆలోచన చేశారు. దీంతో ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సుల చార్జీలు భారీగా పెంచింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల ఆలోచనతో తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ అధికారులు చార్జీలను తగ్గించలేదు. దీంతో విజయవాడ వెళ్లిన బస్సులు, తిరిగి వచ్చేటప్పుడు జనం లేక వెలవెలబోతూ వస్తున్నాయి. మొత్తానికి ఏపీఎస్ ఆర్టీసీకి రెండు మార్గాల్లో జనంతో బస్సులు నిడిపోతున్నాయి.  

Tags:    

Similar News