AndhraPradesh Police Department: టెక్నాలజీ వినియోగం లో దేశానికే ఆదర్శంగా ఏపీ పోలీస్

AndhraPradesh Police Department: జాతీయ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పది అవార్డులను సొంతం చేసుకుంది. కాగా, ఈ సంవత్సరం ఇప్పటికే 26 అవార్డులను ఎపి పోలీస్ శాఖ దక్కించుకుంది.

Update: 2020-08-25 15:25 GMT

andhra pradesh police department won 10 awards national level

AndhraPradesh Police Department: జాతీయ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పది అవార్డులను సొంతం చేసుకుంది. కాగా, ఈ సంవత్సరం ఇప్పటికే 26 అవార్డులను ఎపి పోలీస్ శాఖ దక్కించుకుంది. తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను ఎపి పోలీస్ శాఖ కైవసం విశేషం.

ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ ఈ అవార్డ్స్ ను ప్రదానం చేసారు. కాగా, టెక్నికల్ విభాగంలో 7 అవార్డులు రాగా, అందులో అనంతపురం జిల్లాకు 2, సీఐడీ 4S 4U విభాగానికి 1 అవార్డు దక్కాయి. ఏడాది వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 36అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఘ‌న‌త సాధించింది. దేశంలో ఏపీ పోలీస్ శాఖ టెక్నాలజీ వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నామని డీజీపీ చెప్పుకొచ్చారు.

వెబినార్ ద్వారా ఈ అవార్డులను ఎపి డిజిపి గౌతం సవాంగ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ హరీష్ కుమార్ గుప్త, ఐ.జి పర్సనల్ మహేష్ చంద్ర లడ్డా, ఐ. జి. పి అండ్ ఎల్ నాగేంద్ర కుమార్, టెక్నికల్ డి.ఐ.జీ పాలరాజు, డి.ఐ.జీ రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.ల‌ 

Tags:    

Similar News