AP Parishad Elections 2021 Live Updates: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు
AP Parishad Elections 2021 Live Updates: విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లా:
విజయనగరం జిల్లాలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
AP Parishad Elections 2021 Live Updates: శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా:
శ్రీకాకుళం జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
AP Parishad Elections 2021 Live Updates: పశ్చిమ గోదావరి జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా:
పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 45 జడ్పీటీసీ, 781ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినయోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
AP Parishad Elections 2021 Live Updates: అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా:
అనంతపురం జిల్లాలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్నిచర్యలు తీసుకున్నామని చెప్పారు ఎస్పీ సత్య ఏసుబాబు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అంటున్న ఎస్పీ సత్య ఏసుబాబు
AP Parishad Elections 2021 Live Updates: కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా:
బేతపల్లి:
కర్నూలు జిల్లా బేతపల్లిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అటు టీడీపీ ఏజెంట్లను బూత్‌లోకి రానివ్వకుండా కట్టెలు పట్టుకుని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం దగ్గర ఇరువర్గాలను చెదరగొట్టారు పోలీసులు. అదేవిధంగా ఓటర్లను ఒక్కొక్కరిగా బూత్‌లోకి పంపుతున్నారు పోలీసులు.
AP Parishad Elections 2021 Live Updates: తూ.గో జిల్లా గున్నేపల్లి
తూర్పుగోదావరి జిల్లా:
గున్నేపల్లి:
తూర్పుగోదావరి జిల్లా గున్నేపల్లి పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన అభ‌్యర్థి గుర్తు లేకుండా బ్యాలెట్స్ పేపర్స్ ఉండటంతో.. జనసేన కార్యకర్తలు ఆగ్రహించారు. పోలింగ్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రంలోని ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారు జనసేన కార్యకర్తలు. ఇక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్ నిలిచిపోవడంతో.. జనసేన కార్యకర్తలతో పోలీసులు చర్చిస్తున్నారు.