Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
పశ్చిమ గోదావరి జిల్లా:
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం 9గంటలు దాటినా భారీగా మంచు కురుస్తున్నా.. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కలరాయనగూడెం అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. డివిజన్ పరిధిలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో భారీగా పోలీసులు మోహరించారు. మొత్తం 164 పంచాయతీలకు మూడో విడతలో పోలింగ్ జరుగుతుంది.
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
కడప :
కడప జిల్లాలొ పంచాయతీ ఎన్నికలు
ఉదయం 8.30 గంటలకు.. 7.57 శాతం పోలింగ్
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
విశాఖ:
పాడేరు పంచాయతీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
అనంతపురం :
తాడిపత్రి మండలం ఆలూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు.
- పుట్లూరు మండలం మడుగుపల్లి , చాల్లువేమలలో స్వల్ప ఘర్షణ
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
విజయనగరం:
జిల్లాలో విజయనగరం డివిజన్ లో ప్రారంభమైన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
- ఉదయం 7-30 గంటలకు 8.7 శాతం పోలింగ్ నమోదు
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
శ్రీకాకుళం జిల్లా:
శ్రీకాకుళం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగుతున్నాయి. పొందూరు మండలం తోలాపిలో వైసీపీ రెబల్స్‌కి టీడీపీ మద్దతు తెలపడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో బూత్‌లోకి ఎవరెవరు వస్తున్నారు అనే అంశంపై ఘర్షణ నెలకొంది.
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
- ఉరవకొండ పంచాయతీలోని మూడో వార్డు ఎన్నిక 21కి వాయిదా
- స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకున్న పరిగణలోకి తీసుకొని అధికారులు
- ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థి ఉన్నట్లు సింబల్ కేటాయించి బ్యాలెట్ పత్రాల ముద్రణ
- తప్పిదాన్ని గ్రహించి ఎన్నికల వాయిదా వేసిన అధికారులు
- సిబ్బంది నిర్లక్ష్యంతో ఎన్నిక వాయిదా జరిగిందని మిగతా అభ్యర్థుల ఆందోళన
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
కర్నూలు జిల్లా:
నందికొట్కూరు మండలం మల్యాల పోలింగ్ కేంద్రంలో పోలింగ్ విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓపిఓ/స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆడిటర్ ఏ.సురేష్ ను సస్పెండ్ చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
కృష్ణాజిల్లా:
- పోలింగ్ కేంద్రంలో విధుల్లో వాలంటీర్లు
- కంచడం గ్రామంలో వాలంటీర్ల హవా
- పోలింగ్ బూత్ లో ఏజెంట్లు గా తిరుగుతున్న వాలంటీర్లు
- వాలంటీర్ల వినియోగాన్ని పట్టించుకోని ఆర్ఓ లు
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
ప్రకాశం జిల్లా:
- కొండపి మండలం కల్లగుంట గ్రామంలోని 4వ పోలింగ్ బూతులో నిలిచి పోయిన పోలింగ్.
- ఓ ఓటు విషయంలో వైసీపీ టీడీపీ వర్గాల మద్య తలెత్తిన వివాదం.
- వాగ్వివాదానికి దిగిన ఇరువర్గాలు.
- ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకోవడంతో మోహరించిన పోలీసులు.
- స్థానిక పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న డిఎస్పీ.