రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన ఎన్నికలు

Update: 2021-01-24 00:30 GMT

ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. తొలిదశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలకు ఎన్నికలు లేవని తెలిపారు. మిగిలిన 11 జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలివిడతలో విజయనగరం, ప్రకాశం జిల్లాలకు ఎన్నికలు లేవని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. మిగిలిన 11 జిల్లాల్లోనూ రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ వెల్లడించారు.

తొలిదశలో 11 జిల్లాల్లోని 14 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో భాగంగా 12 జిల్లాల్లోని 17 డివిజన్లు, మూడో విడతలో 13 జిల్లాల్లోని 18 డివిజన్లు, నాలుగో విడతలో 13 జిల్లాల్లోని 19 డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

ఈ లెక్కన.. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ డివిజన్లలో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. అలాగే విశాఖ రెవెన్యూ డివిజన్‌, తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం రెవెన్యూ డివిజన్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు రెవెన్యూ డివిజన్, కృష్ణాజిల్లాలోని నూజివీడు రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

అలాగే.. గుంటూరు డివిజన్, నెల్లూరు డివిజన్, చిత్తూరు జిల్లాలోని తిరుపతి డివిజన్, కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్‌, అనంతపురం జిల్లాలోని పెనుకొండ డివిజన్‌తో పాటు కడప, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.


Tags:    

Similar News