MP Vijay SaiReddy about YSR Jayanthi Celebrations: అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ కే దక్కింది

MP Vijay SaiReddy about YSR Jayanthi Celebrations: వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ పేదవాడి మనసుల్లో చెరగని ముద్ర వేశాయి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు.

Update: 2020-07-08 10:45 GMT
Vijay Saireddy (Twitter Photo)

MP Vijay SaiReddy about YSR Jayanthi Celebrations: వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ పేదవాడి మనసుల్లో చెరగని ముద్ర వేశాయి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ కే దక్కిందని ఆయన అన్నారు. వంశధార నిర్వాసితులకు త్వరలోనే పరిహారం అందించబోతున్నాం అని ఆయన తెలిపారు. అదే విధంగా తిట్లీ బాధితులకు త్వరలోనే నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన ఎంత సున్నితమో, జిల్లాల విభజన కూడా సున్నితమైనదే అని ఆయన అన్నారు.

దాని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ 25 జిల్లాల ఏర్పాటు పై హామీ ఇచ్చారని గుర్తు చేసారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల మనోభావాలు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేసారు. జిల్లా నుంచి రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పాలకొండ విడదీయడం ప్రజలకు ఇష్టం లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగదు అని హామీ ఇచ్చారు. బిసిలకు, ఇతర వెనుకబడిన సామాజికవర్గాల ప్రజల అభ్యున్నతికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.


 

Tags:    

Similar News