న్యాయ వ్యవస్థను గౌరవించే వ్యక్తిగా వాస్తవ విషయాలు చెప్తున్నా : మంత్రి బొత్స
నిన్న మొన్న వచ్చిన తీర్పులను అవగాహన చేసుకుంటూ న్యాయస్థానం పట్ల విధేయతతో చెప్తున్నాం. అమరావతి అవినీతి విచారణపై ఒక గాగ్ ఆర్డర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మనుషులు, తనయుడు దోపిడీ చేశారని చెప్పాము.
మేము చెప్పినట్లే ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ అవకతవకలు, అవినీతిని రాజ్యాంగ బద్దంగా విచారిస్తున్నాం. దీనిలో భాగంగానే అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ పై శాసన సభలో చర్చ చేసాం.
కాబినెట్ సబ్ కమిటీ వేసి నిశితంగా పరిశీలించాం, సిట్ వేసి పరిశీలించమని కూడా చెప్పాము. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే విచారణ చేపట్టాం. దానిలో చాలా అవకతవకలు గమనించి ఏసీబీ కి ఇచ్చాం.
దానిలో దమ్మలపాటి శ్రీనివాస్, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల కుమార్తెలపై అభియోగాలు వచ్చాయి. సహజంగా వారు కోర్ట్ కి వెళ్లడం వారి హక్కు మాకు అబ్యంతరం లేదు. నా 30 ఎళ్ల రాజకీయ జీవితంలో వాటిపై విచారణ అవసరం లేదనడం రాజ్యాంగ స్ఫూర్తికి సహజ న్యాయానికి ఎంతవరకు సమంజసమో వారు చేసిన దుశ్చర్యలపై విచారణ చేయొద్దంటే ఎలా?
ఎన్నో కేసులను కోర్టులే విచారించమని ఆదేశించిన సందర్భాలున్నాయి. పెద్దలపై ఏమైనా వస్తే విచారణ అవసరం లేదా? పేదవాళ్లకు మాత్రం అవసరం లేదా...?పేద వాడికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదా...? సాక్షాత్తు ఐఏఎస్, సుప్రీం కోర్ట్ జడ్జిలకు స్థలాలు ఇవ్వొచ్చా..?
చంద్రబాబు లాంటి వ్యక్తులు దోచుకు తింటే దానికి వత్తాసు పలకాలా..?పెద్దల పేరుంటే టీవీలు, సోషల్ మీడియాలో రాకూడదా..?సాక్షాత్తు న్యాయ కోవిదులు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు..మా ఎంపీలు ఈ రోజు పార్లమెంటులో ప్రశ్నించారు. స్టార్టింగ్ లోనే కాబినెట్ సబ్ కమిటీని వద్దంటే ఇదెక్కడి న్యాయం. ఆ పిల్ వేసింది ఎవరు...ఓ పార్టీకి చెందిన వ్యక్తులు రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు పిల్ వేస్తే ఇటువంటి ఆదేశాలు రావడంపై ఏమి చేయాలి?
మా సీఎం, మంత్రులు, ప్రభుత్వానికి అందరికీ న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది. ఎవరో న్యాయవాది, న్యాయమూర్తి కూతుర్ల పేర్లు వచ్చాయని ఇలాంటి నిర్ణయం సమంజసమా? జరిగిన అవినీతి ప్రజలకు తెలపడానికి మేము ముందుకు వెళుతుంటే మాకు ఎక్కడుంది న్యాయం.
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తులపై సైతం ఆరోపణలు వచ్చాయి...అప్పుడు కూడా ఇలాంటి గాగ్ ఆర్డర్ ఇవ్వలేదే. చట్టం తన పని చేసుకోవాలి...న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుంటుంది.