ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు.

Update: 2021-01-08 16:55 GMT

Nimmagadda Ramesh Kumar (File Image)

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి.. నాలుగు దశల్లో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ ఈ నెల విడుదల చేస్తారు.అదే విధంగా ఈనెల 7న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని నిమ్మగడ్డ ప్రకటించారు. ఫిబ్రవరి 5న తొలిదశ ఎన్నికలు, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని రమేష్ కుమార్  ప్రకటించారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రతి దశ ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది.

ఎన్నికల నిర్వహణ ఇలా..

తొలి దశ ఎన్నికలు:

నోటిఫికేషన్‌ జారీ- జనవరి 23

నామినేషన్ల స్వీకరణ- జనవరి 25

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 27

నామినేషన్ల పరిశీలన- జనవరి 28

నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 31

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 5

రెండో దశ ఎన్నికలు:

నోటిఫికేషన్‌ జారీ- జనవరి 27

నామినేషన్ల స్వీకరణ- జనవరి 29

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 31

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 1

నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 4

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 9

మూడో దశ ఎన్నికలు:

నోటిఫికేషన్‌ జారీ- జనవరి 31

నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 2

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 4

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 5

నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 8

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 13

నాలుగో దశ ఎన్నికలు

నోటిఫికేషన్‌ జారీ- ఫిబ్రవరి 4

నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 6

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 8

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 9

నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 12

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 17 

Tags:    

Similar News