Coronavirus Effect AP in Top 5: కరోనా కేసులలో టాప్ ఫైవ్ లో ఏపీ!

Coronavirus Effect AP in Top 5: లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో

Update: 2020-07-24 16:38 GMT
coronavirus (File Photo)

Coronavirus Effect AP in Top 5: లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది.. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువ కేసుల నమోదు అవుతున్నాయి. ఈ రాష్ట్రాల తర్వాత ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అటు తెలంగాణ తొమ్మిదో స్థానంలో ఉంది.

అయితే ఇందులో ఏపీకి , కర్ణాటక రాష్ట్రాల మధ్య కేవలం అయిదు వేల కరోనా కేసులు మాత్రమే తేడా ఉన్నాయి. 3.47 లక్షల కరోనా కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తమిళనాడులో 1.99 లక్షలతో రెండో స్థానంలో , ఢిల్లీలో 1.27లక్షలు, కర్ణాటకలో 85 వేలు, ఏపీలో 80వేల కేసులతో మిగిలిన స్థానాలలో ఉన్నాయి. అయితే కరోనా కేసులు ఎక్కువ చేస్తున్న రాష్ట్రాలలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీలో 15,41,993 టెస్టులు నిర్వహించారు.

ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 8,147 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.కొత్తగా 2,380 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయ్యారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 80,858కి చేరుకుంది. ప్రస్తుతం కేసులతో కలిపి రాష్ట్రంలో 39,990 యాక్టివ్ కేసులు ఉన్నాయ్. ఇక కరోనాతో పోరాడి రాష్ట్రంలో ఇప్పటివరకు 39,935 మంది డిశ్చార్జ్ అయ్యారు. 933 మంది కరోనాతో పోరాడి మరణించారు.  




 


Tags:    

Similar News