ఈనెల 28 వరకూ ఏపీ హైకోర్టు విధుల నిలిపివేత

ఏపీ హైకోర్టు, విజయవాడ మెట్రో పాలిటన్ కోర్టులపై కరోనా ప్రభావం ఏర్పడింది.

Update: 2020-06-25 07:17 GMT

 ఏపీ హైకోర్టు, విజయవాడ మెట్రో పాలిటన్ కోర్టులపై కరోనా ప్రభావం ఏర్పడింది. దాంతో ఈనెల 28 వరకూ హైకోర్టు విధులను నిలిపివేశారు. హైకోర్టు విధులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు హైకోర్టు రిజిస్టర్ సర్క్యులర్ జారీ చేశారు. కాగా నిన్న ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన హైకోర్టులో విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటు రావడంతో.. ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

అయితే దురదృష్టవశాత్తు ఆయన మార్గం మధ్యలో మరణించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్ గా ఉన్నారు. కొత్తగా మరో మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా నియమితులయ్యారు. ఇక మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు ఏపీలో ఏకంగా 36,047 కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 21వ తేదీన 24,451 పరీక్షలు నిర్వహించగా.. ఆ రికార్డు బుధవారం వెనక్కివెళ్ళింది.


Tags:    

Similar News