High Court Dismisses YCP MLA Petition: హైకోర్టులో టీడీపీకి ఊరట.. వైసీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు
High Court Dismisses YCP MLA Petition: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది.
High Court Dismisses YCP MLA Petition: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అక్రమ కట్టడమంటూ ఆయన వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. టీడీపీ ఆఫీసును ఆత్మకూరు వద్ద వాగు పోరంబోకు స్థలంలో నిర్మించారంటూ ఎమ్మెల్యే ఆర్కే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో టీడీపీకి భూకేటాయింపు చేస్తూ జారీచేసిన జీవో 228 ను రద్దు చెయ్యాలని.. టీడీపీ ఆఫీసు నిర్మాణానికి వాగుకు చెందిన 3.65 ఎకరాల్ని 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ గత ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందనిఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.
అది నిబంధనలకు విరుద్ధమని ఎమ్మెల్యే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అంతేకాదు పర్యావరణ చట్టాల ప్రకారం.. చెరువులు, వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల భూములను నిర్మాణాలకు ఇవ్వడం చట్ట విరుద్ధమని ఆర్కే తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని భవనాన్ని కూల్చివేయాలని కోరారు. అయితే పిల్ వేయడంలో ఎమ్మెల్యే ఆర్కే ఆసక్తి ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. అయితే దీనిపై ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టుకు వెళతారా లేక ఇంతటితో ఆపేస్తారా అన్నది త్వరలో తేలనుంది. టీడీపీ నేతలు మాత్రం హైకోర్టు తీర్పుతో కుషీగా ఉన్నారు.