Health Minister Alla Nani: మైల్డ్ కోవిద్ ఉన్న వారికి 109 కేర్ సెంటర్లు.. వైద్య మంత్రి ఆళ్ల నాని

Health Minister Alla Nani:మైల్డ్ కోవిద్ పేషెంట్లకు గాను చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా 109 కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

Update: 2020-08-13 07:24 GMT
Alla Nani (File Photo)

Health Minister Alla Nani:మైల్డ్ కోవిద్ పేషెంట్లకు గాను చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా 109 కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఈ రోజు 11 గంటలకు నెల్లూరులో జిల్లా పరిషత్ ఎమర్జెన్సీ కంట్రోలింగ్ సెంటర్ నుండి క్వారంటైన్ సెంటర్ లో ఉన్న కరోనా పేషంట్స్ తో జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 138ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ను కోవిడ్ హాస్పిటల్స్ గా వినియోగిస్తున్నారు. మైల్డ్ కోవిడ్ ఉన్న వారికీ మరో 109కోవిడ్ కేర్ సెంటర్లు ను గుర్తించామని.. కరోనా బాధితుల కోసం 56వేలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. 

కరోనా రోగులకు సయ పడడానికి 24గంటలు పని చేసే కాల్ సెంటర్స్ తో హెల్ప్ డెస్క్ లు కూడ ఏర్పాటు చేసామని, కేవలం అర్ధ గంటలో కోవిడ్ పేషంట్ కు హాస్పిటల్ లో బెడ్ కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 8, 619మంది కరోనా పేషంట్స్ డీఛార్జి అయ్యారన్నారు.ఆక్సిజన్ బెడ్స్ 2, 340ఉండగా 843మంది కి ఆక్సిజన్ వినియోగిస్తున్నామన్నారు. 1, 497బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా మొబైల్ యూనిట్స్ ద్వారా 1500పైగా కేంద్రాల్లో శాంపిల్స్ సేకరిస్తున్నామని చెప్పారు... రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో టెస్ట్లు చేయడం, కరోనా సోకిన వారిని వేగంగా గుర్తించడం, వారితో కాంటాక్ట్ లో ఉన్న వారిని కూడ గుర్తించడం, తగిన వైద్య సదుపాయం కల్పిస్తున్నామన్నారు.

కోవిడ్ హాస్పిటల్ కు చికిత్స కోసం వచ్చిన ఏ ఒక్కరూ వేచి ఉండవలసిన పరిస్థితి ఉంకూడదని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి అదేశిo చారన్నారు... మెనూకు సంబంధించి..ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా... వాటిపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి కోవిడ్ పేషంట్ కు 500రూపాయలు వెచ్చించడం జరుగుతుందన్నారు. కోవిడ్ టెస్ట్లు చేయడంలో దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో టెస్ట్లు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి గారు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారన్నారు. క్లస్టర్ల లో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వీలైనంత త్వరగా కేసులు గుర్తిస్తున్నాం... కరోనా పాజిటివ్ గా గుర్తించిన కేసులకు వేగంగా చికిత్స చేయడం తో పాటు, వైరస్ వ్యాప్తిని అరికట్టాలని లక్ష్యం గా పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నామన్నారు...

ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ పేషంట్ కు వైద్యం నిరాకరించిన ప్రభుత్వ నిబంధనలు మేరకు కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు... కరోనా మరణాలకు సంబంధించి లెక్కలు సరిగా లేవని...కరెక్ట్ గా చేప్పడం లేదని చంద్రబాబు నాయుడు పదే పదే విమర్శలు చేస్తున్నారు... కరోనా నియంత్రణలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహారిస్తుంది.. దేశంలో ఎక్కడ ఖర్చు చేయలేనన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది.. ఈ విపత్తుకర పరిస్థితులల్లో రాజకీయాలు చేయడం చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు... కరోనా కట్టడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టి బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు.. కరోనా పేషంట్ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత... దురదృష్టవ శాత్తు చనిపోతే... ఎటువంటి అపోహలకు తావు లేకుండా.. నిర్భయంగా దహన సంస్కారాలు చేయవచ్చు... కరోనా మృత దేహం పై ఆరు గంటలు తర్వాత ఎటువంటి వైరస్ ఉండదని WHO.. ఇతర వైద్య ఆరోగ్య సంస్థలు వెల్లడించాయన్నారు.  

ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని.. ఒకవేళ ఎవరైనా ఆ మృత దేహాలను తీసుకు వెళ్ళాక పోతే...ప్రభుత్వమే బాధ్యతలు తీసుకొని లీగల్ కార్యక్రమాలు పూర్తి చేసి.. ప్రభుత్వమే వారికి సంబంధించిన లాంఛనాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు... ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కు కూడ విజ్ఞప్తి చేస్తున్నామని, విపత్కర పరిస్థితులల్లో మీ సేవలు కూడ ప్రభుత్వానికి.. ప్రజలకు అవసరం... వైద్య సేవలు అందించక పోతే కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదన్నారు... కోవిడ్ హాస్పిటల్స్ లో బెడ్స్ కు సంబంధించిన వివరాలు ఆయా హాస్పిటల్స్ వద్ద డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని అదేశాలు ఇచ్చామన్నారు. అదే విధంగా కోవిడ్ కేర్ హాస్పిటల్స్ లో బెడ్స్ కు సంబంధించిన వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్ లో కూడా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్మార్, కలెక్టర్ చక్రధర్ బాబు, శాసనసభ్యులు వర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News