AP HRC Office: హెచ్‌ఆర్సీ ప్రధాన కార్యాలయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP HRC Office: *2017లో విజయవాడలో హెచ్‌ఆర్సీ కార్యాలయం ఏర్పాటు, *ఉత్తర్వులను సవరించి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
AP HRC Office: హెచ్‌ఆర్సీ ప్రధాన కార్యాలయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఆర్సీ ప్రధాన కార్యాలయం విజయవాడ నుంచి కర్నూలుకు తరలించనున్నారు. 2017లో విజయవాడలో హెచ్‌ఆర్సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ఉత్తర్వులను సవరించి తాజా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ లోకాయుక్త, ఉప లోకాయుక్త ప్రధాన కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు లోకాయుక్త కార్యాలయాలు హైదరాబాద్ కేంద్రంగా పని చేశాయి.