వ్యాక్సిన్ అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం : సీఎం జగన్

Update: 2020-11-24 10:57 GMT

AP Govt. on Coronavirus Vaccine Distribution : కొవిడ్ వ్యాక్సిన్ ను ప్రజలకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎంతోపాటు అధికారులు పాల్గొన్నారు. వ్యాక్సిన్‌ తయారీ, వ్యాక్సినేషన్‌ ముందుగా ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, పంపిణీ సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతులపై వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చర్చించారు.

అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న అంశంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో అనుసరించే శీతలీకరణ పద్ధతులు? అందుకు ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండాలి? తదితర అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం, అదే ఉష్ణోగ్రతలో మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ ను తరలించడం అన్న రెండు కీలక అంశాలపై ప్రణాలికలు ఉండాలన్న సీఎం.. వ్యాక్సిన్‌ సంబంధిత అంశాలపై కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News