విశాఖపట్నంలో ట్రామ్ ట్రైన్..ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం

విశాఖలో ట్రామ్ ట్రైన్ పరుగులు తీయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2020-11-24 05:07 GMT

Tram-train (representational image)

ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా రాజధానిగా మారబోతున్న విశాఖపట్నంలో ట్రామ్ ట్రైన్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆర్కే బీచ్ నుంచి భీముని పట్నం వరకు ఈ రైలును పరుగులు పెట్టించాలని యోచిస్తోంది. విద్యుత్ తో నడిచే ట్రామ్ ట్రైన్ వైజాగ్ ప్రజా రవాణా వ్యవస్థను ఈజీగా మార్చనుంది.

విశాఖపట్నం జనాభా సుమారు 23 లక్షలు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా మారబోతుండటంతో జనాభా మరింత పెరిగే అవకాశం ఉంది. పర్యాటకుల తాకిడి అధికమవుతుంది. దీంతో రవాణా వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. ట్రాఫిక్ సమస్య నివారణకు ఇప్పటి నుంచే ప్రభుత్వం దృష్టి పెట్టింది.

2018లో చైనా తయారుచేసిన ట్రామ్‌ ట్రైన్‌ ట్రాక్‌ లేకుండానే రోడ్లపైనే సెన్సార్ సిగ్నల్స్ తో నడుస్తుంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మూడు కంపార్ట్‌మెంట్స్ లో 300 మంది ప్రయాణం చేయవచ్చు. విద్యుత్‌తో నడిచే దీన్ని ఎక్కడ్నుంచి ఎక్కడికైనా నడిపించవచ్చు. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తక్కువగా ఉంటాయి. ట్రామ్ ట్రైన్ ఖర్చు కూడా తక్కువ.

విశాఖలో ట్రామ్ ట్రైన్ నిర్మాణంపై ఇప్పటికే అధ్యయనం పూర్తయింది. ఈ ట్రామ్ ట్రైన్ ను ప్రతిపాదిత మెట్రోరైల్‌ స్టేషన్లతో అనుసంధానించి నగరం మొత్తాన్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమునిపట్టణం వరకు ట్రామ్ ట్రైన్‌ను పరుగులు పెట్టించాలని యోచిస్తోంది.

ఇప్పటికే విశాఖ టూరిజం కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ట్రామ్ ట్రైన్ వస్తే మరింత మంది పర్యాటకుల్ని ఆకర్షించడంతో పాటు ట్రాఫిక్ సమస్య తీరుతుందని వైజాగ్ వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన స్మార్ట్ సీటీ విశాఖలో ట్రామ్ ట్రైన్ స్పెషల్ అట్రాక్షన్ గా మారనుంది.


 

Tags:    

Similar News