AP Government Agreement With Amul Dairy: అమూల్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం..

AP Government Agreement With Amul: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది. అమూల్‌తో జగన్ సర్కార్ కీలక అవగాహనా ఒప్పందం చేసుకుంది.

Update: 2020-07-21 10:54 GMT

AP Government Agreement With Amul: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది. అమూల్‌తో జగన్ సర్కార్ కీలక అవగాహనా ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో అమరావతిలో అమూల్‌ చెన్నై జోనల్‌హెడ్‌ రాజన్‌, ఎంఓయూపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి ఆనంద్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీతో, అమూల్‌ చేసుకున్న ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగు అని అన్నారు. దేశంలోనే పాల ఉత్పత్తిలో ఆంద్రప్రదేశ్ 4వ స్థానంలో ఉన్నామన్నారు. మహిళల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతులు తనతో మాట్లాడారని లీటరు పాలు, లీటరు మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర ఒకేలా ఉందంటూ వారు తనకు చూపించారని గుర్తు చేశారు. లీటరు మినరల్‌ వాటర్‌ రూ.22కి లభిస్తే పాలు కూడా అంతే ధరకు లభిస్తున్నాయన్నారు. పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారి కష్టానికి తగ్గ ధరలు లభించడం లేదన్నారు. వ్యవస్థీకృత రంగానికి కేవలం 24 శాతం పాలు మాత్రమే వెళ్తున్నాయన్నారు.

కాలక్రమంలో ప్రభుత్వ సహకార డెయిరీలు రాజీ పడిపోయాయని, కొన్ని రాజకీయ కుటుంబాల చేతుల్లోకి వెళ్లిపోయాయని తెలిపారు. గతంలో ప్రభుత్వ సహకార రంగం బలంగా ఉన్నప్పుడు పోటీ వాతావరణం ఉండేది కాదన్నారు. పోటీ వాతావరణం పూర్తిగా రాజీ పడిపోయే పరిస్థితికి వచ్చిందని ఆయన తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న వారు తమ సొంత కంపెనీ హెరిటేజ్‌ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారన్నారు. మహిళల కోసం వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాలను ప్రారంభిస్తున్నామన్నారు. అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ రంగంలో మంచి మార్పులను ఆశిస్తున్నామని రైతులకు, సహకార రంగానికి మేలు జరగాలని ఆరాటపడుతున్నామన్నారు.

Tags:    

Similar News