Andhra Pradesh: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం
Andhra Pradesh: ఏపీ వైద్యారోగ్యశాఖ కీలక ఆదేశాలు * ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీకి కరోనాకు బెడ్స్ కేటాయించాలని ఆదేశం
Andhra Pradesh: ఏపీ వైద్యారోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌కు 50 శాతం పడకలు ఇవ్వకపోతే ఆయా ఆస్పత్రుల కోవిడ్ అనుమతులతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించింది. రానున్న రెండ్రోజుల్లో అన్ని ఆస్పత్రుల్లోను తనిఖీలు చేపడతామని, ఆరోగ్యశ్రీ కింద రోగులకు బెడ్లు ఇవ్వకపోతే చర్యలు చేపడతామని సూచించింది. కోవిడ్ చికిత్స చేసే ఏ ఆస్పత్రిలో అయినా 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీకి కేటాయించాల్సిందేనని, కోవిడ్ పేషెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తే భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది వైద్యారోగ్యశాఖ.