AP Government in Prevention of illegal Alcohol: అక్రమ మధ్యం నివారణలో ఏపీ ప్రభుత్వం.. రాణిస్తున్న పోలీసులు

AP Government in Prevention of illegal Alcohol: ఏపీలో మద్య నిషేదంలో భాగంగా షాపులు తగ్గించి, ధరలు పెంచడంతో కొందరు అక్రమార్కులు పక్కదారి పడుతున్నారు.

Update: 2020-07-16 04:45 GMT
illegal liquor

AP Government in Prevention of illegal Alcohol: ఏపీలో మద్య నిషేదంలో భాగంగా షాపులు తగ్గించి, ధరలు పెంచడంతో కొందరు అక్రమార్కులు పక్కదారి పడుతున్నారు. సమీప సరిహద్దు రాష్ట్రల్లోంచి అక్రమంగా మద్యాన్ని ఏపీకి తీసుకొచ్చి అమ్మకం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వీటిని ఏపీ పోలీసు అధికారులు మట్టు బెడుతున్నారు. అక్రమ మద్యం నుంచి నాటుసారా తయారీ, అమ్మకాలను నిరోధించేందుకు ప్రణాళిక పరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పాల్పడ్డవారిని మే నెల 16 నుంచి ఇప్పటివరకు జూలై 13 వరకు చూసుకుంటే సుమారుగా 30వేల మందిపై కేసులు నమోదు చేశారు.

ఎపిలోకి అక్రమంగా మద్యం తెచ్చేవారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు ప్రణాళిక పరంగా పనిచేస్తున్నారు. ఏపీకి అనుసంధానమైన రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలతో అక్రమ రవాణాకు ఎస్ఈబీ అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సాంకేతికతను జోడించి పనిచేస్తున్నారు. రాత్రివేళ గస్తీని ముమ్మరం చేస్తూ.. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపుదాడులు చేయడం, సీసీ కెమెరాలు, మొబైల్ చెక్ పోస్టులతో పాటు ఇన్ఫార్మర్ల వ్యవస్థ కూడా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డ వారిని వేలాది మందిని అరెస్టు చేస్తున్నారు.

* మే నెల 16 నుంచి జూలై 13 వరకు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

* నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించి మొత్తం 9,536 కేసులు నమోదు చేయగా, 10,918 మందిని అరెస్టు చేశారు.

* 1,20,225 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు.

* 22,06,159 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

* 1,399 వాహనాలు సీజ్ చేశారు.

* అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో తయారై (నాన్ డ్యూటీ పేయిడ్) ఏపీ సరిహద్దుల్లోకొచ్చిన మద్యానికి సంబంధించి 8,994 కేసులు నమోదు చేసి 14,140 మందిపై కేసులు నమోదు చేశారు.

* 98,830 లీటర్ల లిక్కరు, 4,996 లీటర్ల బీర్లు సీజ్ చేశారు.

* 5,597 వాహనాలు సీజ్ అయ్యాయి.

* రాష్ట్రంలో తయారైన మద్యం (డ్యూటీ పేయిడ్) అక్రమంగా విక్రయించే వారిపై 4,063 కేసులు నమోదు చేసి.. ,715 మందిని అరెస్టు చేశారు. 32,845 లీటర్ల లిక్కర్, 1,203 లీటర్ల బీరు సీజ్ చేశారు.

* 883 వాహనాలు సీజ్ చేశారు. 


Tags:    

Similar News