ఏపీలో మరో డాక్టర్ పై వేధింపులు : సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం

ఏపీలో మరో డాక్టర్ పై వేధింపులు జరిగినట్టు అరోపణలు వినిపిస్తున్నాయి.

Update: 2020-06-09 03:35 GMT

ఏపీలో మరో డాక్టర్ పై వేధింపులు జరిగినట్టు అరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని స్వయంగా డాక్టర్ ప్రకటించగా, దీనిపై విచారించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. డాక్టర్ అనితా రాణి ఇష్యూని సీఐడీకి అప్పగిస్తూ సీఎం జ‌గ‌న్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఘ‌ట‌న‌లో నిజానిజాలు తేల్చాల‌ని సీఎం సీఐడీకి సూచించిన‌ట్లు తెలుస్తోంది.

డాక్టర్ సుధాక‌ర్ లాగే త‌న‌ను కూడా వేధిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా డాక్టర్ అనితా రాణి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత‌లు టార్గెట్ చేశారంటూ ఆమె ఆరోపించారు. కానీ దీనిపై పోలీసులు చ‌ర్యలు తీసుకోవ‌టం లేద‌ని డాక్టర్ అనితా రాణి ఆరోపించారు.

డాక్టర్ అనితా రాణి ట్రీట్మెంట్ స‌రిగ్గా చేయ‌ద‌ని, చిత్తూరు జిల్లా డీఎంహెచ్వో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు డాక్టర్ సుధాక‌ర్ లాగే ద‌ళిత మ‌హిళ డాక్టర్ అనితా రాణి ప‌ట్ల దారుణంగా వేధించార‌ని, వైసీపీ నేత‌ల అవినీతికి స‌హక‌రించ‌ని కార‌ణంగానే ఇలా చేస్తున్నారంటూ టీడీపీ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేర‌కు వైద్యురాలి వాయిస్ తో ట్వీట్ చేశారు.


Tags:    

Similar News