ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే ఓపీ : డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్(ఓపీ) సేవలు నిలిచిపోయాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్(ఓపీ) సేవలు నిలిచిపోయాయి. కరోనా రోగులతోనే అన్ని ఆసుపత్రులు నిండిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓపీ సేవలపై శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఔట్ పేషంట్ సేవలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇతర వ్యాధులతో వచ్చే రోగులను చూసేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఇవ్వాలని సూచించింది.
సాధారణ రోగుల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలను కూడా ఏర్పాటు చేయాలని ఆసుపత్రులకు ఆదేశాలిచ్చింది. కొత్త మార్గదర్శకాన్ని ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక ఓపీ చూడాలని ఆదేశించారు.
సి-19 పేరుతో ఓపీ రూం ఏర్పాటు సహా ప్రత్యేక ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యులకు, సిబ్బందికి ఇతర రోగులకు కొవిడ్ సోకకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. వైద్యులు తప్పనిసరిగా పిపిఇలు, ఎన్95 మాస్కులు ధరించి పేషెంట్ల ను పరీక్షించాలి జవహర్ రెడ్డి తెలిపారు. కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వారిని ప్రత్యేక వార్డుకు షిఫ్ట్ చేయాలని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి.