జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతి మెట్రో పేరు మార్పు

అమరావతి మెట్రో పేరు మారుస్తూ జగన్ సర్కార్ మారో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2020-04-28 03:04 GMT
YS Jagan (File Photo)

అమరావతి మెట్రో పేరు మారుస్తూ జగన్ సర్కార్ మారో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ జీవో జారీ చేసింది. ఏపీలో వివిధ ప్రాంతాల్లో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసం పేరు మార్చినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

చంద్రబాబు హయాంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే ప్రయత్నాలు అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో.. రాజధాని అమరావతి ప్రాంతంతో పాటు, విశాఖలో మెట్రో నిర్మాణం చేపట్టాలని భావించింది. దీనిపై డీపీఆర్‌పై కసరత్తు ప్రారభించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టింది. అయితే విశాఖపట్నంలో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్ట్‌కు కూడా అమరావతి మెట్రో ప్రాజెక్టు అని పేరు ఉండటంతోనే ఈ మార్పు చేసినట్లు చెప్పుకొచ్చారు.

అంతేకాదు గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ మెట్రో ప్రాజెక్ట్ పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్పు చేసినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా పేరు మార్చారని ప్రస్తావించింది.


Tags:    

Similar News