Swarna Palace Incident: విజయవాడ స్వర్ణప్యాలస్ ఘటనపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం
Swarna Palace Incident: విజయవాడలో గత నెలలో జరిగిన స్వర్ణప్యాలెన్ అగ్ని ప్రమాదం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Swarna Palace Incident: విజయవాడలో గత నెలలో జరిగిన స్వర్ణప్యాలెన్ అగ్ని ప్రమాదం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రమేష్ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది గాయపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వంతో స్పందించి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు అనుమతుల్లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొవిడ్‌కేర్ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే..
రాష్ట్ర భుత్వం ఈ ఘటనపై కమిటీ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేవలం ధనార్జనే ధ్యేయంగా రోగులకు సరైన సదుపాయాలు లేకుండా వ్యవహరించిందని రమేష్ ఆస్పత్రి నిర్వాకంపై ఆరోగ్యశాఖ నివేదికను సమర్పించింది. హోటల్ లో రోగుల కోసం కనీసం స్పెషలిస్టును కేటాయించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు నివేదికలో పేర్కొంది. కోవిద్ ఆస్పత్రి నిర్వహణకు ప్రభుత్వం విధించిన నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించిందని పేర్కొంది.
ఈ ఘటనపై రమేశ్ ఆస్పత్రి ఎండీ రమేశ్ బాబు, ఛైర్మన్ సీతారామ్మోహన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ రమేష్ హాస్పిటల్ నిర్వాహకులు హై కోర్ట్ ను ఆశ్రయించారు. అయితే, తమపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ వారు న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో హై కోర్ట్ వారిపై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్ట్ రిజిస్టర్డ్ ఎన్‌ఎల్సీ నంబర్‌ను కేటాయించనుంది.