మాజీ మంత్రి అఖిల ప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు
- బోయిన్‌పల్లి పీఎస్ కు తరలింపు - కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారించనున్న పోలీసులు - ప్రవీణ్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు
హైదరాబాద్ బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియా హస్తం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు. ఆమెను కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు భర్త భార్గవ్ రామ్‌ను కూడా అరెస్ట్ చేశారు. వారిని కూకట్ పల్లి నుంచి బోయిన్‌పల్లికి తీసుకొచ్చారు. విచారించిన అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నారు.
హఫీజ్‌పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా భూమ, మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావుకి గొడవ జరుగుతోంది. అయితే ఈ కేసులో ఇరువర్గాల మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే.. భూమ అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్.. తన సోదరులతో కలిసి ఐటీ అధికారులంమంటూ సీన్ క్రీయేట్ చేసి ప్రవీణ్ రావుతో పాటు మరో ఇద్దరిని కిడ్నాప్ చేశారు.. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. కిడ్నాప్ అయిన గంటల్లోనే ఈ కేసును చేధించారు..
కిడ్నాప్‌కు గురైన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నార్సింగిలో ముగ్గురిని కిడ్నాపర్లు వదిలి పారిపోయారు. దీంతో ప్రవీణ్, నవీన్‌తోపాటు సునీల్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అటు కిడ్నాపర్లను వెంబడించిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. రాంగోపాల్‌పేట్‌లో రెండు వాహనాలను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులతోపాటు మరో 8మందిని అరెస్ట్ చేశారు.
ఐటీ రైడ్స్ అని చెప్పిన తమ ఇంట్లో 15 నుంచి 20 మంది వచ్చినట్టు కిడ్నాప్‌కి గురైన ప్రతాప్ రావు తెలిపారు. మాస్క్‌లు పెట్టుకుని ఇంటికి వచ్చినట్టు వెల్లడించారు. తమ వారిని బంధించి.. ఖాళీ పేపర్ మీద సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెచ్చరని పేర్కొన్నారు. దానికి ఒప్పుకోకపోవడంతో తమని కిడ్నాప్ చేశారని తెలిపారు.. హైదరాబాద్ పోలీసులు వేగంగా స్పందించడంతోనే తము బతికామన్నారు.
మరోవైపు కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్ రావు ఇంటికి బోయిన్‌పల్లి పోలీసులు చేరుకున్నారు. బాధితులు ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావుల స్టేట్ మెంట్ నమోదు చేస్తున్నారు.