చిత్తూరు జిల్లా:చిత్తూరు జిల్లా రామకుప్పంలో కిడ్నాప్ కలకలం రేగింది. ఓ మహిళా టీచర్‌ను కిడ్నాప్ చేసి సుమోలో తీసుకెళ్తుండగా పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. కిడ్నాప్‌కు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాపర్లు వాడిన సుమోను స్వాధీనం చేసుకున్నారు.ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా నుండి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 3 లారీల్లో తరలిస్తున్న 90 టన్నుల రేషన్ బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లాలో: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఓ స్కూటర్ లో పాము కన్పించడం కలకలం రేపింది. స్కూటర్ సీటు కవర్ తీయడంతో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో మెకానికి భయాందోళనకు గురయ్యాడు. ఎట్టకేలకు బండిలో దాక్కున్న పామును బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా: బనగానపల్లె నియోజకవర్గం వ్యాప్తంగా అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. కోత నూర్పిడి దశలో ఉన్న తరుణంలో వర్షం అన్నదాతను ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే కోత కోసిన పంట కూడా కళ్లల్లో ఉండటంతో వర్షానికి తడిసిముద్దయ్యింది. నెల్లూరు జిల్లాలో:నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలతో అన్నదాతకు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. కోత దశలో ఉన్న వరి పైర్లు నీట మునిగాయి. నూర్పిడి చేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లలో