AP DGP Gautam Sawang: అన్ని దేవాలయాలకు పటిష్ట భద్రత
AP DGP Gautam Sawang | కొంత మంది ఆకతాయలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ వ్యక్యానించారు.
AP DGP Gautam Sawang | కొంత మంది ఆకతాయలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ వ్యక్యానించారు. రాష్ట్రంలో అన్ని ఆలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని.. లైట్లు, సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జియో త్యపింగ్, నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశామన్నారు.
అంతర్వేది అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని.. దేవాలయాల వద్ద జియో ట్యాగింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై విచారణ జరుగుతుందని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. ఇప్పటికే చాలా ఆధారాలు సేకరించామని.. తమ దర్యాప్తు నివేదికను సీబీఐకి అప్పగిస్తామన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలనీ పోలీసులకు సూచించారు. అంతే కాదు, అగ్నిప్రమాదం నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని, ప్రజలు కుడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.