Andhra Pradesh create record in corona tests : ఆంధ్రప్రదేశ్ కరోనా నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు

Andhra Pradesh create record in corona tests: కరోనా నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సాధించింది. 10 లక్షల మార్క్‌ను దాటిన కరోనా టెస్టులు.

Update: 2020-07-05 14:25 GMT

Andhra Pradesh create record in corona tests: కరోనా నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సాధించింది. 10 లక్షల మార్క్‌ను దాటిన కరోనా టెస్టులు. ఆదివారం నాటికి 10,17,140 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు పూర్తిచేశారు. గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు చేయడం ద్వారా పది లక్షల మార్కును చేరుకుంది. మిలియన్ జనాభాకు 19048 టెస్టులు చేసి దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రాంగానూ ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలిచింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి టెస్టులు మొదలు అయ్యాయి. మే 12వ తేదీకల్లా 2 లక్షల కోవిడ్ పరీక్షలు పూర్తిచేశారు. ఆ తరువాత కేవలం 21 రోజుల్లోనే 2 లక్షల పరీక్షలు చేశారు. దాంతో జూన్ 2 నాటికి నాలుగు లక్షల టెస్టులు పూర్తయ్యాయి.

అనంతరం కేవలం 15 రోజులలోనే మరో రెండు లక్షల పరీక్షలు జరిపారు. దాంతో జూన్ 17 నాటికి రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు 6 లక్షలు దాటాయి. ఆ తరువాత మరో 9 రోజులలోనే రెండు లక్షల పరీక్షలు చేసింది.. దాంతో 8 లక్షలు పరీక్షలు పూర్తి చేసిన మూడో రాష్ట్రంగా నిలించింది. ఇక మరో రెండు లక్షల టెస్టులు చేయడానికి కూడా 9 రోజులే పట్టింది. ఇదిలావుంటే గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అలాగే కొత్తగా 391 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 14 మంది మృతి చెందారు.

Tags:    

Similar News