AP CM YS Jagan Meets Amit Shah: అమిత్ షాతో భేటీ అయిన ఏపీ సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Meets Amit Shah | ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

Update: 2020-09-22 14:50 GMT

AP CM YS Jagan Meets Amit Shah | ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ ముందుగా  అమిత్ షా నివాసానికి వెళ్లి ఆయనను కలిసారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భీటీ జరగ్గా.. విభజన చట్టంలోని హామీలు, పోలవరం ప్రాజెక్ట్ కు ఖర్చు చేసిన నిదులు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, రాజధాని విషయంలో కేంద్ర హోం శాఖకు, హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ వంటి వివరాలను జగన్ అమిత్ షా కు వివరించినట్లు వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం ఈ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లతో జగన్ సమావేశంకానున్నారు. అయితే వైఎస్ జగన్ తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు కూడా హాజరయ్యారు.

అయితే, మార్చిలో లాక్‌డౌన్ తరువాత సీఎం జగన్ ఢిల్లీ వెళుతుండటం ఇదే తొలిసారి. తన ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం జగన్ నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 23న(బుధవారం) విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3.50 గంటలకు సీఎం జగన్‌ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6:20 నిమిషాలకు గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న(గురువారం) ఉదయం గం. 8:10 నిమిషాలకు కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో వైఎస్‌ జగన్ పాల్గొనున్నారు.  

Tags:    

Similar News