CM Jagan Wishes to KTR: మంత్రి కేటీఆర్ కి సీఎం జగన్ విషెస్!
CM Jagan Wishes to KTR: తెలంగాణ ఐటి మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
CM Jagan wishes to KTR : తెలంగాణ ఐటి మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ''ప్రియమైన నా సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు ఆరోగ్యాన్ని, అంతులేని సంతోషాలను ప్రసాదించాలి'' అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అయితే దీనిపైన మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ''ధన్యవాదాలు అన్నా'' అని రీట్వీట్ చేశారు.
Many thanks Anna 🙏 https://t.co/Zm5sXBYa8n
— KTR (@KTRTRS) July 24, 2020
అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని కూడా మంత్రి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. "ప్రజా సేవలో నిమగ్నమై యువతలో స్ఫూర్తి నింపుతున్న మీకు అన్ని సంతోషాలు దక్కాలి అని ఆకాంక్షించారు" ఇక సినీ నటులు, రాజకీయ ప్రముఖులు,పార్టీ నేతలు మంత్రి కేటీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Birthday Greetings to @KTRTRS Garu who has been an inspiration to youth in public life.
— Rajini Vidadala (@VidadalaRajini) July 24, 2020
May you be blessed with good health and happiness.🎂#KTR pic.twitter.com/n8j5f5SC9T
1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు కేటీఆర్ జన్మించారు. ఉన్నత చదువులు చదువుకొని అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము కోసం జరుగుతున్న ఉద్యమం కోసం అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు.
ఇక 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అదే సిరిసిల్లా నియోజకవర్గం నుంచి పోటి చేసి గెలిచి తొలిసారి ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతున్నారు.