విశాఖ ఘటనపై సీఎం జగన్ సీరియస్!

విశాఖలో ప్రేమోన్మాది చేతిలో బలైన వరలక్ష్మి మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

Update: 2020-11-01 09:20 GMT

విశాఖలో ప్రేమోన్మాది చేతిలో బలైన వరలక్ష్మి మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఆడ పిల్లలంతా దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధిత వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్ ను సీఎం ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు తెలిపారు.

అటు గాజువాక వరలక్ష్మి హత్య కేసులో పోలీసులు ప్రాథమిక విచారణను పూర్తి చేశారు. సాయంత్రం కేసు వివరాలు వెల్లడించనున్నారు. ఘటన స్థలంలో అఖిల్ సాయి ఒక్కడే ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. వరలక్ష్మికి ఫోన్ చేసి ఘటన స్థలానికి పిలిచినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే అఖిల్ సాయి తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో దాడి చేసినట్టు పోలీసులు తేల్చారు. బాధితురాలు వరలక్ష్మికి కేజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు.


Full View


Tags:    

Similar News