AP Government Action On IAS Madireddy Prathap: ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌కు షాకిచ్చిన జగన్ సర్కార్
AP Government Action On IAS Madireddy Prathap: ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మాదిరెడ్డి ప్రతాప్ ను తన శాఖనుంచి ఆకస్మికంగా తప్పించిన సంగతి తెలిసిందే
AP Government Action On IAS Madireddy Prathap: ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మాదిరెడ్డి ప్రతాప్ ను తన శాఖనుంచి ఆకస్మికంగా తప్పించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజుల కిందటే ప్రతాప్‌ను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మాదిరెడ్డి ప్రతాప్ స్థానంలో రవాణాశాఖ కార్యదర్శి కృష్ణబాబుకి ఆర్టీసీ వీసీ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రతాప్ ఆయన బదిలీ అవ్వడానికి ముఖ్య కారణం ఈ నెల 13న ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలే అని ప్రభుత్వం చెబుతోంది. ఆయన ప్రెస్‌మీట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎస్ నీలం సాహ్ని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలకు ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.. సమాధానం ఇవ్వకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే ఆయనను ప్రస్తుతం ఉన్న శాఖనుంచి సాధారణ పరిపాలన విభాగానికి రిపోర్ట్ చేయాల్సిందిగా మాదిరెడ్డి ప్రతాప్‌ను చీఫ్ సెక్రెటరీ ఆదేశించారు. కాగా మాదిరెడ్డి ప్రతాప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేకపోవడం వల్లే రాష్ట్రం రెండుగా విడిపోయిందని.. సీఎం కొడుకు పొలిటికల్ ఇంట్రస్ట్ వల్లే జైల్లో పెట్టారన్నారని వ్యాఖ్యానించారు. అయితే బదిలీపై మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐదేళ్ల పాటూ ఐటీ కార్యదర్శిగా పనిచేశానని.. అప్పుడు కొందరు అధికారుల్ని బదిలీ చేసిన ఫైల్స్‌పై విచారణ జరిగితే.. తనను మాత్రం విచారించలేదని.. అది తన విశ్వసనీయత అని అన్నారు.