ఆన్‌లైన్ కాల్‌మనీ వేధింపులపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. లోన్ యాప్స్ కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వారి ఆగడాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.... రుణాల వసూళ్లలో వేధింపులకు పాల్పడితే కేసులు పెట్టాలని సూచించారు.
ఆన్‌లైన్ కాల్ మనీ వేధింపులతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న బాధితుల కుటుంబాలకు... సీఎం జగన్ ఆర్ధిక సహాయం ప్రకటించారు. గుంటూరు జిల్లా కొర్రపాడులో ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబానికి 10లక్షలు... ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగురాలి కుటుంబానికి 5లక్షల రూపాయలు అందించాలని అధికారులకు ఆదేశించారు.