AP Cabinet Meeting: ఆగష్టు 19న ఏపీ కేబినెట్ సమావేశం..
AP Cabinet Meeting: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19న తేదిన కేబినెట్ సమావేశం కానుంది.
AP Cabinet Meeting: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19న తేదిన కేబినెట్ సమావేశం కానుంది.ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తెసుకోనున్నరు అని సమాచారం. రాష్ట్రంలో కరోనా ఉధృతి, ఎక్కువగా ఉన్న కారణంగా ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తెసుకొనూన్నరు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కుడా చర్చించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై కమిటీ వేయడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇళ్ల పట్టాల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై కూడా ప్రధానంగా చర్చించనున్నారు.
మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చేర్చ సాగే అవకాశం ఉంది అని సమాచారం. అయితే, హై కోర్ట్ దీనిపై ఆగస్ట్ 27 వరకు స్టే విదించిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రంలో నిత్యం పాజిటివ్ కాసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా ప్రబలతున్నా నేపధ్యంలో కళాశాలలు, పాఠశాలల ప్రారంభంపై మంత్రిమండలి సభ్యులు తమ అభిప్రాయాలను ఈ కేబినెట్ సమావేశంలో తెలుసుకోనున్నారు.
ఇక రాష్ట్రంలో శుక్రవారం నమోదయిన కరోనా కేసులు చేస్తే.. ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,996 కరోనా కేసులు వచ్చాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,64,142 కి చేరుకుంది. ఇందులో మొత్తం 90,840 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకూ 1,70,924 మంది కరోనా నుంచి కోలుకున్నారు.తాజాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 82 మంది చనిపోయారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 10 మంది, అనంతపురం జిల్లాలో 8, కడప జిల్లాలో 7, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 6, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5, కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయారు. దీనితో మరణించిన వారి సంఖ్య 2,378కి చేరుకుంది.