Andhra Pradesh: ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం
Andhra Pradesh: ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు
Andhra Pradesh: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు త్వరలో నిర్వహించబోయే మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై కూడా సమీక్షించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న వాటి తీరుతెన్నులను సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఏపీలో వచ్చే నెల 10న మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి ప్రభావం బడ్జెట్ సమావేశాలపై పడే అవకాశం కనిపిస్తోంది. 2021- 22 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌ను వచ్చే నెల 31 లోపు ప్రవేశపెట్టాలి. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి నడుస్తోంది. దీంతో ఎన్నికలు జరిగే సమయంలో బడ్జెట్ సమావేశాలు పెట్టవచ్చా? అనే చర్చ జరుగుతోంది. ఒక వేళ బడ్జెట్ సమావేశాలు నిర్వహించకపోతే ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై కూడా కేబినెట్‌లో కీలకంగా చర్చించనున్నారు.
సాధారణంగా బడ్జెట్ సమావేశాలు మార్చి నెల మొదటి వారంలో ప్రారంభమవుతాయి. కానీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 15 తర్వాత బడ్జెట్ సమావేశాలు పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం పరిణామాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.