AP Bjp MP's Letter To Amith Shah: రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది
AP Bjp MP's Letter To Amith Shah |ఏపీలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం పై కేంద్ర హోమ్ మంత్ర అమిత్ షా కు బీజీపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సిఎం రమేష్ లేఖ రాసారు.
AP Bjp MP's Letter To Amith Shah |ఏపీలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం పై కేంద్ర హోమ్ మంత్ర అమిత్ షా కు బీజీపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సిఎం రమేష్ లేఖ రాసారు. ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 'నిరసనలు తెలిపే హక్కు ఎవరికైనా ఉంది. ప్రేస్నిస్తే జైలులో పెడుతున్నారు. పాక్లో అణచివేతకు గురవుతున్న హిందువులు భారత్ శరణ కోరుతున్నారు. ఇప్పుడు ఏపీలో హిందువులు ఎక్కడ శరణు కోరాలి?' అని జీవీఎల్ నరసింహారావు, సిఎం రమేష్ తమ లేఖలో ప్రశ్నించారు.
అంతర్వేది ఘటనలో, హిందూ సోదరులపై అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ, అమలాపురం ఆర్డీఓ కార్యాలయం దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తున్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ ను, వారితో పాటుగా ఉన్న ఇతర నాయకులను,కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
గత కొన్ని నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దేవాలయాలపై జరుగుతున్న దాడులని ప్రశ్నిస్తూ బిజెపి చేపడుతున్న కార్యక్రమాలను అన్ని విధాలుగా అడ్డుకుంటూ, నాయకులను, అమాయక ప్రజలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.