కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు

Update: 2021-02-15 14:31 GMT

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామని కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి చెప్పారు. సెయిల్, ఎన్ఎండీసీలో విలీన ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆంధ్రులు వ్యతిరేకిస్తున్నారని.. ప్రజల మనోభావాలను పరిరక్షించాల్సిన అవసరముందని కేంద్రమంత్రికి తెలిపినట్లు సోమువీర్రాజు చెప్పారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణకు ఉన్న ప్రత్యామ్నాయ అంశాలు.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరినట్లు చెప్పారు. విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కుగా ఉంటుందని ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల శ్రేయస్సు, ప్రజల మనోభావాలను కేంద్ర మంత్రికి వివరించామని తెలిపారు. 

Tags:    

Similar News