ఏపీ బస్సులను అనుమతించాలని తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలకు ఏపీ వినతి

జూన్ 8వ తేదీ నుంచి అంతరాష్ట్ర సర్వీసులను నడిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2020-06-05 05:59 GMT

జూన్ 8వ తేదీ నుంచి అంతరాష్ట్ర సర్వీసులను నడిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్నితెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలకూ తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నినిన్న లేఖను రాశారు.

ఏపీ నుంచి వచ్చే బస్సులకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ మూడు రాష్ట్రాలను కోరారు. అయితే తమిళనాడులో మాత్రం కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో, ఆ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో.. తమిళనాడుకు మాత్రం ఆమె లేఖను పంపలేదని తెలుస్తోంది. కాగా, ప్రైవేటు వాహనాలు, రైళ్లలో భారీ ఎత్తున ప్రజలు వస్తుండటంతో, వారందరి వివరాలు సేకరించడం కష్టంగా ఉందని ఇటీవల ఏపీ జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం వద్దవాపోయిన సంగతి తెలిసిందే. వెంటనే బస్సులను అనుమతించాలని వారు రవాణా శాఖకు తెలిపారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం అంతరాష్ట్ర ప్రయాణికులను అనుమతిస్తున్నప్పటికీ, బస్సుల విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని తెలంగాణ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. ఈ విషయంలో మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చని, సోమవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం అవుతాయని తెలుస్తుంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం వినతి మేరకు ఆయా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో చూద్దాం.

Tags:    

Similar News