ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. జున్ 7 సోమవారంనుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. జున్ 16వ తేదీ బుధవారంతో ముగుస్తాయి. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం జులై 21వ తేదీ నుంచి ప్రారంభం కానుందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. త్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్:
ఓఎస్‌ఎస్‌సీ మేయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
జూన్ 7: ఫస్ట్ లాంగ్వేజ్
జూన్ 8 : సెకండ్ లాంగ్వేజ్
జూన్ 9 : ఇంగ్లీష్
జూన్ 10 : గణితం
జూన్ 11: ఫిజికల్ సైన్స్
జూన్ 12 : బయోలాజికల్ సైన్స్
జూన్ 14 : సోషల్ స్టడీస్
జూన్ 15 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
జూన్ 16 : ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు(థియరీ)