Anandayya Ayurvedic Medicine: పెరుగుతున్న ఆనందయ్య మందు బాధితులు

Anandayya Ayurvedic Medicine: వైసీపీవాళ్లు ఆనందయ్యతో మందు చేయించుకుని వాళ్ల వరకు వాళ్లు వాడేసుకుంటున్నారు ఆరోపణలు వచ్చాయి

Update: 2021-05-28 06:07 GMT
ఆనందయ్య ఆయుర్వేద మందు (ఫైల్ ఇమేజ్)

Anandayya Ayurvedic Medicine: వాడే వాళ్లు వాడేసుకుంటున్నారు. వాడి దెబ్బ తిన్నోళ్లు ఆస్పత్రికి పోతున్నారు. ఆ మందు పని చేస్తుందో లేదో చెప్పి పుణ్యం కట్టుకోండి.. బతికి బట్టకడతాం అని వేలాదిమంది బతిమాలుతున్నారు. అయినా ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు ప్రభుత్వం. వైసీపీవాళ్లు ఆనందయ్యతో మందు చేయించుకుని వాళ్ల వరకు వాళ్లు వాడేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆనందయ్యే స్వయంగా తానే మందు పంపిణీ చేస్తానని అనుమతి ఇప్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశాడు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుకు సంబంధించి సేకరించిన పరిశోధన ఫలితాలను న్యూఢిల్లీలోని సీసీఆర్ఏఎస్‌కి అధికారులు పంపారు. ప్రస్తుతం ఆనందయ్య మందు పంపిణీని నిలిచిపోయింది. ఈ మందు గురించి శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలితే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఇదిలావుంటే, నెల్లూరు ఆనందయ్య మందు తీసుకున్న వారు చాలా మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో 98 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారు. వారిలో 8 మంది బాధితులు.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆనందయ్య నాటుమందు పంపిణీ చేసిన మూడు రోజుల్లో జీజీహెచ్‌ నుంచి అధిక సంఖ్యలో కరోనా బాధితుల డిశ్చార్జ్ అయ్యారు. అయితే నాటుమందు పనిచేయకపోవడంతో మళ్లీ ఆస్పత్రుల్లో చేరుతున్నారు బాధితులు.

ప్రస్తుతం హెడ్‌మాస్టర్‌ కోటయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నెల్లూరు జీజీహెచ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డా.నరేంద్ర తెలిపారు. వైద్యానికి కోటయ్య సహకరిస్తున్నారన్నారు. ఆనందయ్య మందు తిన్న వారిలో కొందరికి.. కంటి సమస్యలు వచ్చిన మాట వాస్తవమే అయినా.. చిన్నపాటి సమస్యలు కావడంతో ప్రమాదమేమీ లేదన్నారాయన.

మరోవైపు, ఆనందయ్య తయారు చేసిన మందును వైద్యులు కొట్టిపారేస్తున్నారు. ప్రజలు మూఢ నమ్మకాలు నమ్మొద్దని సూచించారు. కరోనా సమయంలో వైద్యులు సూచించిన మందులే వాడాలని సూచించారు.

Tags:    

Similar News