Vizag Fishing Harbor: ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదంపై కొనసాగుతున్న విచారణ
Vizag Fishing Harbor: మరో 17 మంది అనుమానితులను విచారిస్తున్న పోలీసులు
Vizag Fishing Harbor: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది. ప్రమాదానికి కారకులకు గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. అనుమానితుడు యూట్యూబర్ ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. మరో 17 మంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.
విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో మంటలు చెలరేగడం ఈ ప్రమాదానికి కారణమైంది. బోట్లలో నిద్రపోతున్న వారు మంటల్లో చిక్కుకున్నారేమోనని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తేలింది.