Anantapur: అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో ప్రమాదం

Anantapur: ఓవర్‌లోడ్‌తో ఇరుక్కుపోయిన టిప్పర్ లారీ

Update: 2023-01-08 05:18 GMT

Anantapur: అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో ప్రమాదం

Anantapur: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని పెన్నానది క్యాజ్ వే పై ఇసుకలోడుతో వెళ్తున్న టిప్పర్ కుంగిపోయింది. తాడిపత్రి నియోజకవర్గం లోని చిన్న పప్పూరు- గార్లదిన్నె గ్రామాల మధ్య రాకపోకలు సాగించడానికి పెన్నా నది పై క్యాజ్ వే నిర్మించారు. గత కొంతకాలంగా చాగల్లు రిజర్వాయర్ నుంచి పెన్నానదికి నీరు విడుదల చేయడం వల్ల నది నిరంతరం ప్రవహిస్తోంది. దీంతో పాటు పెద్దపప్పూరు ఇసుకరీచ్ నుంచి ఓవర్ లోడుతో వెళుతున్న ట్రాక్టర్లు, టిప్పర్ల కారణంగా క్యాజ్ వే పూర్తిస్థాయిలో దెబ్బతినింది. క్యాజ్ వే పై ఇసుక టిప్పర్ వెళుతున్న సమయంలో ఓ పక్కకు కుంగిపోయింది.

ఈ నెల 23 నుంచి శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేల మంది భక్తులు అశ్వర్థక్షేత్రానికి వస్తారు. కుంగిపోయిన క్యాజ్ వే కారణంగా భక్తులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అధికారులు కుంగిపోయిన క్యాజ్ వే కు మరమ్మతులు చేపట్టి వాహనదారులకు, మండల ప్రజలకు, అశ్వత్థం తిరుణాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News