రాజధాని కోసం గుండె ఆగిందంటూ కథలు అల్లోద్దు : అమరావతి రైతు కుమార్తె

ఏపీ రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి చిన్న లాజార్‌ అనారోగ్యంతో మృతి చెందారు.. ఆయన రాజధాని రైతుల వ్యవసాయ..

Update: 2020-10-11 05:17 GMT

ఏపీ రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి చిన్న లాజార్‌ అనారోగ్యంతో మృతి చెందారు.. ఆయన రాజధాని రైతుల వ్యవసాయ కూలీల సంక్షేమ అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. లాజార్‌ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్బంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేసి రైతు లాజార్‌ గుండెపోటుతో మరణించారని నారా లోకేశ్ తోపాటు పవన్ కళ్యాణ్ ట్వీట్ లో ఆరోపించారు. అయితే ఈ ట్వీట్లపై లాజార్ కుమార్తె పులి ఎస్తేర్ తీవ్రంగా మండిపడ్డారు..

ఈ మేరకు లోకేశ్, పవన్ లకు రీట్వీట్ లు చేశారు.. తన తండ్రి గుండెపోటుతో చనిపోయారని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.. అనారోగ్యంతో చనిపోతే గుండెపోటుతో చనిపోయాడని ఎలా చెబుతారని అన్నారు. అంతేగాదు తన తండ్రి పోరాటం చేసింది రాజధాని కోసం కాదని రైతుల కోసమని ఆమె అన్నారు. ఇంకా ఆమె మాటల్లోనే.. 'మా నాన్న గారు చనిపోయి పుట్టెడు దుక్ఖంలో ఉన్నాము ఆయన మరణాన్ని మీ నీచ రాజకీయాల కోసం వాడుకుని పబ్బం గడుపుకో వద్దు... చేతనైతే నాలుగు ఆదరణ మాటలు చెప్పండి లేకుంటే మౌనంగా ఉండండి అంతే గాని రాజధాని కోసం గుండె ఆగిందంటూ పిట్ట కథలు అల్లోద్దు. ' అంటూ మరో ట్వీట్ లో ఎస్తేర్ పేర్కొన్నారు. 


Tags:    

Similar News