Ambati Rambabu: పవన్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉంది
Ambati Rambabu: ఎవరైనా చికిత్స చేసేవారు ఉంటే ముందుకు రావాలి
Ambati Rambabu: పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. వారాహి యాత్ర పూర్తి చేసినందుకు ప్యాకేజ్ స్టార్ పవన్‌కు అభినందనలు అన్నారు. పవన్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందని, ఎవరైనా చికిత్స చేసేవారు ఉంటే ముందుకు రావాలని ఎద్దేవా చేశారు.
పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు కోపం వచ్చి ఊగిపోయాడని ఆగ్రహించారు. పవన్ కల్యాణ్ తన స్పీచ్ లో 373 సార్లు జగన్ పేరును ఉచ్చరించాడని, వెయ్యి సార్లు జగన్ పేరు ఉచ్చరించటం పూర్తి చేస్తే పవన్ పాపాలు కొన్ని అయినా కొట్టుకుపోతాయని అంబటి సెటైరికల్ కామెంట్ చేశారు.