Ambati Rambabu: లోకేష్‌ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదు

Ambati Rambabu: లోకేష్‌ యువగళం పాదయాత్రపై మంత్రి అంబటి విమర్శలు

Update: 2023-01-28 09:59 GMT

Ambati Rambabu: లోకేష్‌ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదు

Ambati Rambabu: లోకేష్‌ యువగళం పాదయాత్రపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. అర్హత అనే పదం పలకలేని వ్యక్తి రాష్ట్రంలో పాదయాత్ర చేయడం దురదృష్టకరమన్నారు. మీ సీఎం అభ్యర్థి ఎవరో చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ చెప్పాలన్నారు. లోకేష్‌ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదన్నారు. యువగళం సభ జనాలు లేక వెలవెలబోయిందని తెలిపారు. లోకేష్‌ సభలో బూతుపురాణం మాట్లాడటం దారుణమన్నారు. రాష్ట్రంలో చిత్తశుద్ధితో పనిచేసేది జగనే అన్న ఆయన ఎంతమంది కలిసొచ్చినా జగన్‌ జగన్నాథ చక్రాల కింద నలిగిపోతారన్నారు. పవన్‌ తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి, నాగబాబు స్పందించాలన్నారు అంబటి. ముందస్తు ఎన్నికల ప్రక్రియ లేదని షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. 

Tags:    

Similar News